నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్
W.G: నరసాపురం టౌన్ ప్రధాన సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాయపేట, బస్టాండ్ ఏరియా, స్టేషన్ పేట, అరుంధతిపేట, రుస్తుంబాద, హౌసింగ్ బోర్డు సహా ఇతర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదు. ప్రజలు సహకరించాలని కోరారు.