ఈనెల 14న శ్రీశైలంలో కోటి దీపోత్సవం
NDL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈనెల 14న తొలి కోటి దీపోత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీపోత్సవాని కావాల్సిన పూజా సామగ్రి దేవస్థానమే అందజేస్తుందన్నారు. పాల్గొనదలచిన వారు నవంబర్ 12లోపు పరిపాలన భవనంలో శ్రీశైల ప్రభ కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.