ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే

ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే

MBNR: బీఆర్‌ఎస్ నాయకులపై ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'చీటింగ్ బడ్జెట్' అని విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా కల్పించడం, ఆకలితో బడికి వచ్చే పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం వంటి ప్రజాహిత నిర్ణయాలు 'చీటింగ్' ఎలా అవుతాయన్నారు.