సభలో ఛైర్మన్ నిష్పక్షపాతంగా ఉండాలి: ఖర్గే
రాజ్యసభలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన ఛైర్మన్‌ను ఉద్దేశించి సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలను కోట్ చేశారు. 'ఛైర్మన్ అనే వ్యక్తి ఏ పార్టీకి చెందిన వారు కాదు' అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రశ్నించే స్వేచ్ఛ లేకపోతే అది నియంతృత్వంగా మారుతుందని హెచ్చరించారు. సభలో నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు.