రేపు కేబినెట్ సమావేశం

రేపు కేబినెట్ సమావేశం

AP: రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈనెల 14, 15న విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు. 12వ SIPBలో నిర్ణయం తీసుకున్న రూ. లక్షకోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలతో పాటు కేంద్ర బృందం పర్యటనపై కేబినెట్ చర్చించనుంది. అలాగే కొత్త జిల్లాలు, రెవిన్యూడివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది.