శ్రీకూర్మం ఆలయ చరిత్ర అందరికీ తెలియజేయాలి: ఎమ్మెల్యే

SKLM: శ్రీకూర్మం ఆలయ చరిత్ర అందరికీ తెలియజేసే బాధ్యత మనపై ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం గార మండలంలోని శ్రీకూర్మం ఆలయం వద్ద మ్యూరల్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రాచీన క్షేత్రం శ్రీకూర్మం ఆలయ ప్రాంగణంలో కోనేరుతో పాటు దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.