ఆ గ్రామంలో మహిళా ఓటర్లకు పెరిగిన డిమాండ్

MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లకు ప్రాధాన్యం పెరిగింది. ఈ గ్రామంలో మొత్తం 2,395 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 1,189 మంది, మహిళలు 1,206 మంది ఉన్నారు. దీంతో, గెలుపు ఓటములను ప్రభావితం చేయగల మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.