మైనర్ల మధ్య గొడవ.. కత్తితో దాడి.!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్‌లో ముగ్గురు మైనర్ బాలురల మధ్య వివాదం నెలకొంది. మనోహర్ అనే బాలుడు పై సాయి ,ఆకాశ్ లు కత్తితో దాడి చేశారు. దీంతో మనోహర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న జగ్గయ్యపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ అనే వ్యక్తి పరారయ్యాడు.