ఒకటి నుంచి.. 19 స్థానాలకు చిరాగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తిపార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర పోషించారు. 2020 ఎన్నికల్లో ఆయన 135 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచారు. అయితే, చిరాగ్ ప్రభావంతో JDU 43 స్థానాలకే పరిమితమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAతో కలిసి పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించారు.