లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు

లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు

AKP: సీఎం చంద్రబాబునాయుడు ఈనెల 23వ తేదీన నక్కపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాయకరావుపేట పోలీసులు సర్కిల్ పరిధిలో లాడ్జిలు, హోటల్స్ విస్తృతంగా తనిఖీ చేశారు. ప్రతి రూమ్ పరిశీలించారు. లాడ్జిల్లో ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాడ్జిలో దిగే వారి పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు.