VIDEO: తనపై కక్షగట్టి జీవనాధారం దెబ్బ తీశారని ఎస్పీకి ఫిర్యాదు

VIDEO: తనపై కక్షగట్టి జీవనాధారం దెబ్బ తీశారని ఎస్పీకి ఫిర్యాదు

కోనసీమ: అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలోని తన మాంసం షాపును అధికారులు అన్యాయంగా తొలగించారని గిరిక మంగాదేవి అనే మహిళ శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. స్థానిక వనుములమ్మ గుడి వద్ద జాతీయ రహదారి పక్కన వ్యాపారం చేసుకుంటున్న తనపై కొందరు కక్షగట్టి అధికారులతో నోటీసులు ఇచ్చి తక్షణమే తొలగించడంతో తమ కుటుంబం వీధిన పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.