చీపురుపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

చీపురుపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

VZM: చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో వైసీపీ పార్టీ పబ్లిసిటీ వింగ్, రాగోలు జెమ్స్ హాస్పటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష ముఖ్య అతిధిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ బాణాన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు బాణాన రామరత్నం, రమణ పర్యవేక్షణలో 450 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.