రైతులకు డ్రోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రైతులకు డ్రోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రైతులకు సూచించారు. చెన్నం రాజు పల్లెలో ఆయన రైతులకు డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకుంటేనే లాభాలు పెరుగుతాయని అన్నారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు వాడాలని కోరారు.