పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

CTR: సోమల మండలంలోని ఇరికి పెంట ప్రభుత్వ పాఠశాలను ఎంఈవో విజయకుమారి సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని వారికి సూచించారు.