భారీ వర్షాల ముప్పు.. అధికారులతో అత్యవసర సమావేశం

మేడ్చల్: రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఎ. శైలజ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా నీట మునిగే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించడం, అత్యవసర సహాయం అందించడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రక్షణ బృందాలను సిద్ధం చేయడంపై చర్చించారు.