VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

GNTR: దాచేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని నారాయణపురానికి చెందిన సుకుమార్ (22)గా గుర్తించారు. హోటల్లో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.