రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జట్ల ఎంపిక

రాష్ట్ర స్థాయి కబడ్డీ  పోటీలకు జట్ల ఎంపిక

VZM: ఈనెల 7, 8, 9 తేదిల్లో కర్నూల్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జట్ల ఎంపిక పోటీలను దాసన్నపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ఐవీపీ రాజు ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌.లక్ష్మణరావు ఎంపిక పోటీలు చేపట్టారు. ప్రతిభ కనబరిచిన 14 మంది బాలురు, 14 మంది బాలికలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.