ఢిల్లీ పేలుడు.. CCTV దృశ్యాలు విడుదల
ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో కొత్త సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటుచేసిన నిఘా కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో సిగ్నల్ వద్ద వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు కనిపిస్తోంది. పేలుడు ధాటికి సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం అయ్యాయి.