VIDEO: కాలభైరవుడికి పంచామృత అభిషేకం, అన్న పూజ..
HNK: జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో కాల అష్టమి సందర్భంగా కాలభైరవుడికి పంచామృత అభిషేకం, అన్నపూజ, ప్రత్యేక అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం సిద్దేశ్వరాలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శుక్రవారం సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.