రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
అన్నమయ్య: బీ.కొత్తకోట మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రప్పగారి పల్లికి చెందిన రెడ్డి నరసింహులు, భూదేవి బైక్‌పై బీ.కొత్తకోటకు కూలీ పనులకు వస్తుండగా, గట్టు గ్రామం ఆకులవారిపల్లికి చెందిన శంకర మరో బైక్‌పై మొరంపల్లి వద్దకు వచ్చారు. ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.