VIDEO: కాణిపాకంలో వైభవంగా సంకటహర గణపతి వ్రతం

CTR: కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని ఇవాళ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఉదయం, సాయంత్రం జరిగిన ఈ వ్రతంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ వ్రతాన్ని ఆలయంలో పౌర్ణమి గడచిన నాలుగవ రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని నిర్వహిస్తే సర్వ కష్టాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు.