హింసను సహించే ప్రసక్తే లేదు: ఈసీ

హింసను సహించే ప్రసక్తే లేదు: ఈసీ

బీహార్‌లో జన్ సూరజ్ కార్యకర్త హత్యకు గురికావటంపై ఈసీ స్పందించింది. ఎన్నికల సమయంలో హింసను సహించేది లేదని స్పష్టం చేసింది. శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పింది. ప్రజాస్వామ్య పండగలో ఓటర్లందరికీ అవకాశం లభిస్తుందని.. శాంతి భద్రతల నడుమ పోలింగ్ జరుగుతుందని హామీ ఇచ్చింది.