గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ వినతి

గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ వినతి

సూర్యాపేట: తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం నందు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ తరపున మండలంలోని కార్మికులందరికీ పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఎంపీడీవో భీంసింగ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించి ఆదుకోవాలన్నారు.