VIDEO: పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ సీఐతో వాగ్వాదం
MDCL: కూకట్‌పల్లి వై జంక్షన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్కింగ్ విషయంలో బాలానగర్ ట్రాఫిక్ సీఐతో జాగృతి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సీఐ తమను అసభ్య పదజాలంలో మాట్లాడారని ఆరోపిస్తూ.. కార్యకర్తలు ఆయనను ముట్టడించారు. ఈ ఘటనతో కూకట్‌పల్లి వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.