ఉమ్మడి జిల్లాలో పంటల సాగు గణనీయంగా తగ్గుదల

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వానాకాలంలో పంటల సాగు గణనీయంగా పడిపోయింది. వ్యవసాయ శాఖ అంచనా వేసిన 15.82 లక్షల ఎకరాల్లో కేవలం 12.41 లక్షల ఎకరాల్లో (77.65%) పంటలు సాగయ్యాయి. వరి సాగు 6,14,320 ఎకరాలకు (69.94%), పత్తి సాగు 8, 78, 376 ఎకరాలకు (85.90%) తగ్గింది. గత ఏడాది 110% సాగుతో పోలిస్తే ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.