కంకర వేశారు.. రోడ్డును మరిచారు
WGL: వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి, రామవరం గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డును నిర్మిస్తున్న సదరు కాంట్రాక్టర్ పనులను నిర్లక్ష్యంగా చేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపించారు. కంకర వేసి వదిలేశారని, రోడ్డు పూర్తి చేయలేదని మండిపడుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నామని, అధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.