శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం వివరాలు

NZB: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మెల్లగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నానికి నీటిమట్టం 46.654 TMCలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లోగా 25,676 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 6,413 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.