రాజయ్యపేట మత్స్యకారులతో సీఎం భేటీకి రంగం సిద్ధం
నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఈ నెల 16న అమరావతిలో సమావేశం కానున్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేసిన రిలే దీక్షల నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమన్వయంతో జరిగే ఈ సమావేశానికి మొత్తం 30 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు సమాచారం.