ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన పీవో

ASR: పెదబయలు మండలంలోని తురకలవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ మంగళవారం తనిఖీ చేశారు. సోమవారం రాగిజావ తిన్న విద్యార్థులు కడుపుతో నొప్పితో బాధపడుతున్నారని తెలిసి వెంటనే సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి రాగి పిండిని వెంటనే ఫుడ్ సేఫ్టీకు పరీక్షల కోసం పంపించాలని ఆదేశించారు.