సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేత

కృష్ణా: పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంకెం వీర వెంకట సత్యనారాయణ (చినబాబు)కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన చినబాబు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా రూ. 2,11,500 మంజూరైంది. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును వేదవ్యాస్ అందించారు.