లోలెవెల్ వంతెనలు పరిశీలించిన కలెక్టర్

SDPT: చేర్యాల మండలంలోని పలు లోలెవెల్ వంతెనలను కలెక్టర్ కె.హైమావతి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తే తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాతావరణశాఖ సూచించిన విధంగా అలర్ట్ ఉండాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.