గిల్‌కు గాయం.. కెప్టెన్‌గా రషీద్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. గిల్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్‌కు రషీద్ ఖాన్ నాయకత్వం వహిస్తున్నాడు. గిల్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, అతను త్వరలోనే కోలుకుంటాడని టాస్ సమయంలో రషీద్ ఖాన్ వెల్లడించాడు. గిల్ స్థానంలో యువ ఆటగాడు కుమార్ కుశాగ్ర ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.