మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి: మంత్రి

మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి: మంత్రి

ఖమ్మం: మార్చి 2026 నాటికి మున్నేరు నది రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగర్ మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో తుమ్మల సమీక్షించారు. ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని పేర్కొన్నారు.