లేడీస్ హాస్టల్ గదిలోకి దూరిన ప్రిన్సిపాల్

TPT: లీలామహల్ సర్కిల్‌లోని ఓ నర్సింగ్ హాస్టల్‌లో దారుణం జరిగింది. కాలేజీ ప్రిన్సిపాల్ గత రాత్రి హాస్టల్‌లోని ఓ గదిలోకి దూరడంతో విద్యార్థినులు అతడిని నిర్బంధించి అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. మాకు న్యాయం చేయాలంటూ అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.