ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఇంఛార్జ్

ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఇంఛార్జ్

ప్రకాశం: ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలను టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి, వారి ఆరోగ్య పరిస్థితులను, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.