ప్రభుత్వ పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ

SKLM: నరసన్నపేట మండలం వరాహ నరసింహపురం (వి.ఎన్.పురం) ప్రభుత్వ పాఠశాలను ఎంఈవో 2 పేడాడ దాలినాయుడు మంగళవారం ఉదయం పరిశీలించారు. జరుగుతున్న ఎఫ్‌ఏవన్ పరీక్షల తీరును పర్యవేక్షించారు. విద్యార్థులకు పరీక్ష విధివిధానాలపై ముందుగా ఉపాధ్యాయులు తెలియజేయాలని సూచించారు. ఈ పరీక్షలు రెండు పూటలా కొనసాగుతాయని తెలిపారు.