మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

RR: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీలో రామ్ సింగ్ అనే వ్యక్తి స్వాతంత్య్ర దినోత్సవం రోజు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నాడు. దీంతో చైతన్యపురి సీఐ సైదులు తనిఖీలు చేపట్టి... రామ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.