'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'
NRPT: కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 13 న జరిగే లోక్ అదాలత్‌తో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.