రాష్ట్రపతి నిలయంలో అగ్నిప్రమాదాలపై అవగాహన

రాష్ట్రపతి నిలయంలో అగ్నిప్రమాదాలపై అవగాహన

HYD: రాష్ట్రపతి నిలయంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖల ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. సుమారు 10 విద్యా సంస్థల విద్యార్థులు, సిబ్బంది, భద్రతా దళాలు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు. మాక్ డ్రిల్ ద్వారా అగ్నిమాపక పరికరాలు ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు చూపించారు.