రేపు వాడపల్లికి రానున్న మంత్రి: ఛైర్మన్
కోనసీమ: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈనెల 12వ తేదీ ఆదివారం వాడపల్లి రానున్నట్లు ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన శ్రీనివాస పార్కింగ్ నందు శ్రీనివాసం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పర్యటనను జయప్రదం చేయాలన్నారు.