VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల ప్రాముఖ్యత, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలు ప్రసంగించారు.