'ప్రకృతి పంటల సంత విజయవంతం'

'ప్రకృతి పంటల సంత విజయవంతం'

విశాఖ ఏయూలోని 'ఏ హబ్'లో ఆదివారం నిర్వహించిన ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతమైందని గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారిత పంటలనే ఆహారంగా తీసుకోవడం మంచిదన్నారు. ఈ సంత ప్రతి ఆదివారం ఇక్కడే జరుగుతుందని, వినియోగదారులకు ఇది వేదికగా మారిందని ఆయన వివరించారు.