సీఎం అయ్యాక తొలిసారి నర్సంపేట పర్యటన
WGL: సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 5న నర్సంపేటలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా నర్సంపేటలో అడుగుపెట్టనున్నారు. 2018 ఎన్నికల ప్రచారం తరువాత ఇప్పుడే నేరుగా ఇక్కడ సభలో పాల్గొననున్నారు. గతంలో పంట నష్టాన్ని పరిశీలించడానికి ఈ మార్గం గుండా వెళ్లినా ఇక్కడ ఆగలేదు. సీఎం పర్యటనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.