గంజాయి నిర్మూలనకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు: ఎస్సై

CTR: సదుం మండలంలో గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని.. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక క్యూఆర్ కోడ్ అందజేసిందని ఎస్సై షేక్షావలి గురువారం తెలిపారు. ఈ స్కానర్ మండల కేంద్రంలోని బస్టాండు, బ్యాంకు, జనసంచారం ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. గంజాయిపై పోలీసుల దాడులు, అభిప్రాయాలను ప్రజలు ఇందులో తెలపవచ్చని సూచించారు.