నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: మరమ్మతుల్లో భాగంగా శనివారం కూసుమంచి మండలం పాలేరు, చేగొమ్మ విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ అశోక్ తెలిపారు. ఈ మేరకు పాలేరు, నాయకన్ గూడెం, హట్యాతండా, వాల్యాతండా, మల్లాయిగూడెం, జుజుల్రావుపేట, భోజ్యాతండా, చేగొమ్మ, ముత్యాలగూడెం, కేశ్వాపురం గ్రామాలకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.