VIDEO: గండికోట అందాలను తిలకించిన అసెంబ్లీ కమిటీ సభ్యులు
KDP: గండికోట అందాలను రాష్ట్ర అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ బృందం పరిశీలించింది. కూన రవికుమార్ ఆధ్వర్యంలోని అసెంబ్లీ కమిటీ సభ్యులు గురువారం సాయంత్రం గండికోటను సందర్శించారు. గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయం, మసీదు, పెన్నాలోయ ప్రాంతాలను వారు తిలకించారు. అలాగే వారంతా సెల్ఫీలు తీసుకున్నారు. వారి వెంట రెవిన్యూ, పోలీస్, పర్యాటక శాఖల అధికారులు ఉన్నారు.