మహా జాతర ఏర్పాట్లకు సామాగ్రి వితరణ

మహా జాతర ఏర్పాట్లకు సామాగ్రి వితరణ

SRD: మనూర్ మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయ మహా జాతర ఏర్పాట్లకు దాతలు భారీగా విరాళాలు అందించారు. ఈ నిధులతో ఆలయ ఛైర్మన్ మల్లయ్య శనివారం హైదరాబాద్‌లో విద్యుత్ దీపాలు, అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేశారు. ఏడు వారాల పాటు జరిగే ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.