6 గేట్ల ద్వారా నీటి విడుదల

NRML: కడెం ప్రాజెక్టులోని 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ప్రాజెక్టులోని 6 గేట్లను ఎత్తి సుమారు 33,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.