స్విమ్మింగ్ పూల్లో మునిగి యువకుడిమృతి

VSP: అచ్యుతాపురం మండలం కొండకర్ల రిసార్టులో గల స్విమ్మింగ్ పూల్లో మునిగి కశింకోటకు చెందిన యువకుడు ఎస్.భాస్కరరావు (25) మృతి చెందాడు. గాజువాక సెలూన్ షాప్లో పనిచేస్తున్న భాస్కరరావు స్నేహితులతో కలిసి మంగళవారం కొండకర్లలో రిసార్ట్‌కు వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.