VIDEO: చిన్నరావుపల్లెలో సామూహిక కళ్యాణోత్సవాలు
SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం సామూహిక కళ్యాణాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహచార్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఈ కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కల్యాణోత్సవంలో సుమారు 10 జంటలు పాల్గొన్నాయని తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం భజన కార్యక్రమం ఉందన్నారు.